క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధికి అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్యం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ప్రిన్సిపాల్ డా. పిజెఎస్ కుమార్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆహారపు అలవాట్లు, కొన్ని దురలవాట్ల కారణంగా క్యాన్సర్ సోకే అవకాశముం దన్నారు. మనదేశంలో చాలామందికి ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డా.ఎన్. శివనాగ్ మాట్లాడుతూ యువత క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలని పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలోని ఐడిఎని జాతీయ సేవాదళం (ఎన్ఎస్ఎస్) మరియు మహిళావిభాగం (ఎండివో)ల సంయుక్త ఆధ్వర్యాన కళాశాల పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్గించే కరపత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వ యకర్త జేసుబాబు, డబ్ల్యుడిసి ఛైర్పర్సన్ సువర్చల, పిజి లైబ్రేరియన్ బిఎస్ఎస్ పద్మజ, గోపి మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa