తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా నీట్ పరీక్షపై తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించడం, బడ్జెట్ లో తమిళనాడుకు జరిగిన అన్యాయంపై స్టాలిన్ అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు. తమిళనాడులో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలను అమలు పర్చేందుకు గవర్నర్ ఆమోదించకపోవడాన్ని సీఎం స్టాలిన్ తప్పుపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు, వివిధ పక్షాల నేతలకు స్టాలిన్ లేఖ రాసిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa