చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన గంగవరం మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం బీడీ కాలనీకి చెందిన మాబుల్ రెండవ కుమార్తె అర్షియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ లాగే ఈ రోజు కూడా ఆటోలో కళాశాలకు బయలుదేరింది. ఆటో సాయిబాబా గుడి సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అర్షియా మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa