అనంతపురం, పుట్టపర్తి: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించడంతో ఈ ప్రాంత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు పుట్టపర్తిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం బీజేపీ పార్టీ స్వాగతిస్తున్నామని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నడయాడిన పుట్టపర్తి ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో జిల్లా వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందని, జిల్లా కేంద్రం అన్ని నియోజకవర్గాలకు మాధ్యమంగా ఉందని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఇప్పటికే ఇక్కడ ఉన్నాయన్నారు.
ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా పుట్టపర్తి నీ అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ఇదివరకే నివేదికలు అందించామని, త్వరలో అవన్నీ కర్యారూపం దాల్చడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని లేపాక్షి ని కూడా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని, పార్లమెంటులో బిజెపి పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహ రావు ఒక బిల్లు ను ప్రవేశపెట్టారన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కృషి చేస్తున్న జీవీఎల్ నరసింహ రావు కి జిల్లా బీజేపీ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కదిరి తిమ్మమ్మ మర్రిమాను, పెనుకొండ కోట, హిందూపురం, లేపాక్షి ఆలయాన్ని, పుట్టపర్తి ప్రశాంతి నిలయం, ధర్మవరం చేనేత కళా వస్ర్తాలను, పర్యాటక ప్రదేశాలుగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి, రాష్ట్ర SC మోర్ఛా అధ్యక్షులు దేవానంద్, కేంద్ర రైల్వే PSC మెంబర్ తలుపుల గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రొద్దం ఉత్తమ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తలమర్ల హరికృష్ణ గౌడ్, జ్యోతి ప్రసాద్, కత్తి రాజారెడ్డి, కొండమరాజు, బాలగంగాధర్, సోకే రామాంజనేయులు, గంగిశేట్టి, యం. యస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బూదిలి సుదర్శన్, సాకే ఓబులేసు, కిసాన్, యస్. టి జిల్లా మోర్ఛా అధ్యక్షులు మేకల శ్రీనివాస్, హరి నాయక్, మండలాల అధ్యక్షులు శేషాద్రి నాయుడు, సుదర్శన్ నాయుడులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa