ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత రుణానికి ఏపీ కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 02:59 PM

ఏపీ ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చిన సరిపోవడంలేదు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల నేపథ్యంలో వైసీపీ సర్కార్ రుణాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఏపీ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్ల అప్పుకోసం ప్రయత్నిస్తోంది. రానున్న మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొనబోతోంది. రుణం పొందేందుకు ప్రతిపాదనలను సమర్పించనుంది. 16 ఏళ్ల కాలపరిమితికి వెయ్యి కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితికి మరో వెయ్యి కోట్లు రుణం పొందేందుకు ఇప్పటికే  ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఎంత శాతం వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది అనే విషయం వేలంలో తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa