ఆవాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆవాల్లోని విటమిన్ ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు దట్టంగా పెరగడానికి సహాయపడతాయి.
- ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్ధాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లకు నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది.
- ఆవాలు రక్తపోటును సమర్ధంగా తగ్గిస్తాయి.
- ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.
- ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి.
- ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
- ఆవాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
- ఆవాలలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్ధంగా జరుగుతాయి.
- ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్ధాలను తగ్గించి దీర్ఘకాలం యవ్వనంగా ఉంటటానికి తోడ్పడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa