విశాఖ జిల్లాలోని జీ.మాడుగుల మండలంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తనయుడు తల్లిని హతమార్చాడు. వంతల పంచాయతీ అడ్డులకు చెందిన రేగం మత్స్యలింగం మద్యం మత్తులో అర్ధరాత్రి ఇంటికి వచ్చి తల్లి అర్జులమ్మను అన్నం పెట్టమన్నాడు. ఆ సమయంలో కూర చేయలేనని చెప్పడంతో ఆగ్రహించాడు. ఆమెతో గొడవకు దిగి గొడ్డలి తీసుకుని మెడపై నరికాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa