గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలంలోని రవ్వరం కొత్త రెడ్డిపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాల్లో సీడీపీవో అనురాధ ఆధ్వర్యంలో కేంద్రాల్లోని చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలకు రక్త పరీక్షలు బరువు , ఎత్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి తల్లి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, మంచి పోషక విలువలతో కూడిన ఆహారం పిల్లలకు అందించాలని తల్లులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa