పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా. ముగ్గురికి గాయాలయ్యాయి. భీమడోలు నుంచి విజయనగరం పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa