ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 02:39 PM

భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.....ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలిస్తే. ఈనెల 14న ఉదయం 5 గంటలా 59 నిమిషాలకు....రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి....పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ C-52 వాహక నౌక ప్రయోగించనున్నారు. వాహకనౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి. ఇవాళ శిఖర భాగాన ఉష్ణకవచం చేపట్టనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ...ఈనెల 13న వేకువజామున 4 గంటలా 29 నిమిషాలకు మొదలవుతుంది. నిరంతరాయంగా 25 గంటలు 30 నిమిషాలు కొనసాగాక...వాహననౌక నింగిలోకి వెళ్లనుంది. P.S.L.V-C-52, I.R.శాట్-1-Aతో పాటు......I.N.S-2-T.D, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa