చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆప్కాబ్ నిధులు రూ. 9 లక్షల అంచనా విలువ తో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , కెడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని , రైతుల సంక్షేమం -అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు ,
అదే విధంగా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అందించటానికి చర్యలు తీసుకుంటున్నామని , రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా కృషి చేస్తున్నామన్నారు , రైతులకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు సొసైటీ భవనాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని , తద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు , పంట కొనుగోలు కేంద్రాలు ఆయా గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు , రైతులకు పెద్ద ఎత్తున రుణాలను కూడా కేడిసిసి బ్యాంక్ పలు స్కీములు ద్వారా తక్కువ వడ్డీకే అందజేస్తుందని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్, పిఎసిఎస్ అధ్యక్షులు , జెడ్పిటిసి , పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa