ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సుల్లో విద్యార్థుల అగచాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 01:11 PM

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలలో విద్యార్థులు కాలేజీలకు‌ వెల్లెందుకు ఆర్టీసీ ‌బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే పలు రూట్లలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఇటు ప్రయాణికులు అటు విద్యార్థులు బస్సుల్లో ప్రయాణించాలంటే దేవుడు కనిపిస్తున్నాడని వాపోతున్నారు. గురువారం ఉదయం కేజిఎఫ్ నుండి కుప్పానికి వచ్చే బస్సులో స్థలం లేక విద్యార్థులు ఫుట్ బోర్డుపై నిలబడి, బస్సు వెనక ఉండే నిచ్చెనను పట్టుకుని వేలాడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఏమవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa