పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం: పశ్చిమ డెల్టా వాసులు నాటి కల నెరవేరబోతోంది. భీమవరం నుంచి నరసాపురం వరకు చేపట్టిన రైల్వే డబ్లింగ్ విద్యుదీకరణ పనులు కొలిక్కి వచ్చాయి. ఈ నెలాఖరు నాటికి కొత్త లైనును వినియోగంలోకి తెచ్చేలా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే భద్రతా విభాగం కమిషనర్ ఈనెల 15, 16 తేదీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నారు. తనిఖీల అనంతరం కొత్త లైనుపై రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa