కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 7 రోజుల క్వారంటైన్ రూల్ ను ఎత్తివేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారిపై గత ఏడాది పలు ఆంక్షలను కేంద్రం విధించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa