అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అలజడి చెలరేగింది. ఏఎంసీలో 9 మంది రోగులు మృతి చెందారు. వారంతా రాత్రి నుంచి ఏఎంసీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మృతులంతా 20 నుంచి 40 ఉళ్ల మధ్య వయస్కులని తెలుస్తోంది. ఆ రోగులంతా నిన్నటి వరకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా మారడంతో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది...0 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.వీరి మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. పూర్తి నివేదికతో తనకు నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ ఆసుపత్రిలో రోగులకు తగినంత మంది వైద్యులు లేరని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. రోగుల మృతిపై ఆ ఆసుపత్రి అధికారులు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa