ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామన్‌మ్యాన్‌ కారునే ఎంచుకున్న రతన్ టాటా

national |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 04:56 PM

ప్రపంచంలోనే లగ్జరీ కార్లుగా జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ బ్రాండ్లకు గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్లలో హైఎండ్‌ మోడల్‌ ధర కోట్లలో ఉంటుంది. ఈ బ్రాండ్లు ప్రస్తుతం రతన్‌టాటా ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి కామన్‌మ్యాన్‌ కోసం డిజైన్‌ చేసిన లక్ష రూపాయల కారు నానోను ఎంచుకున్నారు రతన్‌టాటా. రతన్‌టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్‌ కారుని తయారు చేసింది టాటా ఎలెక్ట్రా సంస్థ. రతన్‌ టాటా కోరిక మేరకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఇటీవల కస్టమైజ్డ్‌ ఈవీ నానో కారును డెలివరీ చేసింది. రతన్‌టాటా అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కారులో ప్రయాణించారు.


రతన్‌ టాటా కోసం తయారు చేసిన నానో 72 వీ ఎలక్ట్రిక్‌ కారు ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రమాణాల ప్రకారం సింగిల్‌ ఛార్జ్‌తో 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా గ్రౌండ్‌ రియాలిటీలో కనీసం 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పది సెకన్ల వ్యవధిలో గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో లిథియం ఐయాన్‌ బ్యాటరీ ఉపయోగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa