మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీలను ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది.మణిపూర్‌లో 60 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీని ఎన్నుకునేందుకు మొదటి దశ పోలింగ్‌ను ఫిబ్రవరి 28న నిర్వహించాలని, ఆ తర్వాత మార్చి 5న రెండో దశ పోలింగ్‌ను నిర్వహించాలని EC నిర్ణయించింది.ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో రాష్ట్రంలో ఓటింగ్ నిర్వహించాలని పోల్ ప్యానెల్ గతంలో నిర్ణయించింది.మొదటి మరియు రెండవ దశల పోలింగ్‌ను రీషెడ్యూల్ చేస్తున్నట్లు EC గురువారం ప్రకటించింది,ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇంఫాల్‌లో పర్యటించామని, రాజకీయ పార్టీలు, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారులు మరియు పోలీసు సూపరింటెండెంట్‌లతో సంప్రదింపులు జరిపినట్లు కమిషన్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa