భారత జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్థాన్ బోట్లను సరిహద్దు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లా హర్మినాలా ప్రాంతంలో అధికారులు సోదాలు నిర్వహించగా బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఆ బోటుతో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa