ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీప్ప్ ప్యాకేటే కదా అని తినిపడేయలేదు..ఏకంగా చీరగా కట్టుకొంది

national |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 01:36 AM

చీప్ప్ ప్యాకేట్లు  మనం తిన్నా వాటి కవర్ మాత్రం పడేస్తుంటాం. కానీ తినడమే కాదు దాని ప్యాకేట్ ను భద్రంగా దాచుకొంది. దానిని తనకు అనువుగా మల్చుకొని ఓ మహిళా వాటిని చీరగా మార్చేసింది. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, కుక్కుపిల్ల.. కాదేదీ కవితకు అనర్హమని అన్నారు మహాకవి శ్రీశ్రీ. కవితల మాటేమోగానీ.. ఇప్పటితరం మాత్రం కొత్త కొత్త పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. అందుకు ఇదిగో ఈ అమ్మాయే ఉదాహరణ. లేస్ చిప్స్ ప్యాకెట్లతో చీర తయారు చేసుకున్న ఆ యువతి.. దానిని కట్టుకుని తెగ మురిసిపోయింది. ప్యాకెట్ లోపలి భాగం బయటకు కనిపించేలా చీరను తయారు చేసి.. దానికి అంచుగా ప్యాకెట్ బయటి భాగం కనిపించేలా పల్లునూ కుట్టింది. ఫర్ ద లవ్ ఆఫ్ బ్లూ లేస్ అండ్ శారీ అనే క్యాప్షన్ పెట్టి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వీడియోను వదిలింది. ఇంకేముంది, ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఓ మైగాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa