వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ గెలుచుకుంది. ఇవాళ జరిగే మూడో వన్డేలోనూ విజయదుందుభి మోగించాలని చూస్తోంది. వరుసగా 11వ సారి వెస్టిండీస్ పై ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న ధవన్ తిరిగి జట్టులోకి రానున్నాడు. జట్టులో పలు మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న విండీస్ కనీసం పోటీనివ్వాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.
ధవన్ జట్టులోకి వస్తే మిడిలార్డర్‌లో మార్పులు జరుగుతాయి. రెండు వన్డేల్లో ఆకట్టుకున్న దీపక్ హుడాకు రెస్ట్ ఇచ్చి వేరే వారికి అవకాశం ఇవ్వొచ్చు. బౌలర్లలో ప్రస్తుతం బెంచ్ మీదున్న అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ కు అవకాశమిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ లేదా చాహల్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ లేదా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను తీసుకునేందుకు అవకాశం ఉంది. పేస్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ నిలకడగా రాణిస్తుండగా, మహమ్మద్ సిరాజ్ స్థానంలో అవేశ్‌ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మూడో వన్డేలో భారీ మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa