ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొత్స తనయుడి వివాహానికి సీఎం జగన్ హాజరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 02:40 PM

ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ-ఝాన్సీ దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణ్ సందీప్-పూజితల వివాహం హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. హెచ్ఐసీసీలో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి-భారతి దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అతిథులను ఆప్యాయంగా పలకరించి, కాసేపు వివాహ వేడుకలో గడిపారు. అనంతరం హైదరాబాద్‌లోని తమ నివాసం లోటస్ పాండ్‌కు పయనమయ్యారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరిగి బయల్దేరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa