కర్ణాటకలోని ఉడిపిలో ప్రారంభమైన క్రమంగా ఆ రాష్ట్రమంతటా వ్యాపించింది. వరుస వివాదాలు, సంఘర్షణల మధ్య విద్యాసంస్థలన్నింటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సెలవులు సైతం ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి అనుకూల, వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి. కొందరు హిజాబ్‌కు, విద్యార్థినులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు వాటిని రాజకీయ ప్రేరేపిత చర్యలుగా కొట్టిపాడేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై తాలిబన్లు కూడా ఓ ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటకలో హిజాబ్ వివాదంపై ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్లు స్పందించారు. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులకు వారు తమ మద్దతు తెలిపారు. కర్నాటక ముస్లిం విద్యార్థినులు ఇస్లామిక్ విలువల కోసం ధైర్యంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. ఇస్లామిక్ విలువలు కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం బాలికలు చాలా త్యాగాలు చేశారని కొనియాడారు. దీనిపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని ట్విట్టర్‌లో తమ స్పందనను తెలియజేశారు.
ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ నుంచి సలీమ్ జావేద్ అనే వ్యక్తి కూడా స్పందించారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తమ దేశ వ్యవహారాల్లో మీ జోక్యమేంటంటూ కౌంటరిచ్చారు. తమ ఇంటి వ్యవహారం తాము చక్కదిద్దుకుంటామంటూ చురకలు అంటించారు. బాలికల విద్య కోసం పోరాడిన మలాలాపై పాకిస్తాన్‌లో దాడి జరిగిందనే విషయం మరువొద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa