మరోమారు డ్రగ్స్ వ్యవహారం టాలివుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. క్లోజ్ అయిపోయిందనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమకు అందించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితులు, సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన రికార్డులు అందజేయాలని లేఖలో కోరింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవంటూ ఎక్సైజ్ శాఖ తేల్చేసింది. అయితే ఈడీ మాత్రం ఈ కేసు విచారణ ఇంకా తొలి దశలోనే ఉందని, విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సేకరించిన డిజిటల్ రికార్డులను తమకు ఇంత వరకు సమర్పించలేదని తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఈడీకి రికార్డులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa