ప్రకాశం జిల్లా అద్దంకి అంటే ఫ్యాక్షన్ గడ్డ... ఒకప్పుడు రక్తం చిందిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ తరాలు పోయాయి..కొత్త తరాలు వచ్చాయి. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో ప్రస్తుతం విద్యార్థుల తీరును చూస్తే సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నిండా 20 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పరస్పర దాడులకు దిగడమే కాకుండా..ఏకంగా ప్రిన్సిపాళ్ల పై దాడులకు తెగబడుతున్నారు.
గత పది రోజుల క్రితం జాతీయ రహదారి పై బైక్స్ రేసింగ్ హంగామా సృష్టించిన విద్యార్థులు నాలుగు రోజుల క్రితం రేకింతలు కొడుతూ కొట్టుకున్నారు. విశ్వభారతి కళాశాల విద్యార్థులు, రాయల్ కళాశాల విద్యార్థులు సినిమా ఫైటింగ్లను తలపించే విధంగా రంకెలు వేస్తూ..కేరింతలు కొడుతూ..ఒకరినొకరు పరస్పర దాడులకు దిగారు. సినిమాల్లో అయితే ఇలాంటి దృశ్యాలను చూస్తే అబ్బో అంటారు.
కానీ రియల్ లైఫ్ లో ఇలా కొట్టుకునే వారిని ఏమనాలి? విద్యారులు అనాలా..? వీధి రౌడీలు అనాలా..? విశ్వభారతి కళాశాలకు చెందిన ఓ విద్యార్ధిని రాయల్ కళాశాల వాళ్లను ఏడిపించారని సినిమాల్లో స్టూడెంట్స్ లా ..రెచ్చిపోయారు. నిన్న ఇదే విశ్వభారతి కళాశాల స్టూడెంట్ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థిని ఏడిపించారంట! దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఏడిపించే విద్యార్థులకు నాలుగు మాటలు గట్టిగా చెప్పాలని ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆ ప్రిన్సిపాల్ ను చావబాదారు. ఎక్కడ..ఎవరికి కొడుతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయనను చితకబాదారు.
దీంతో ఆ ప్రిన్సిపాల్ కి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడటంతో కళాశాలకు వెళ్లాల్సిన ప్రిన్సిపాల్ వైద్యశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా సమస్యలు ఉంటే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. అంతే కాదు పోలీసు స్టేషన్‌కు వెళ్లాలి. అంతే కానీ, వీధి రౌడీల్లా రోడ్ల పై రెచ్చిపోతుండటం సర్వత్రా చర్చానీయంశంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలు నాలుగు విద్యాబుదులు నేర్చుకొని... ఉన్నత స్థితికి చేరాలని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పని చేస్తూ విద్యార్థులను చదివిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి మరీ చదివిస్తుండగా..బుద్దిగా చదుకోవాల్సిన విద్యారులు పోరంబోకులా తయారై వీధికెక్కుతున్నారు.
విద్యార్థి దశలో పోలీసులు కేసులు నమోదైతే విద్యార్థుల భవిష్యత్ సర్వనాశనం అవుతుంది. కానీ ఆ విద్యార్థులకు భవిష్యత్ అంటే భయం లేకుండా పోయింది. ఇంతటి పెద్ద ఘర్షణలకు కారణం ఒకరిద్దరి మూలంగా అందరూ తిట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాశాలల్లో గ్యాంగ్ లీడర్లుగా భావించుకుంటున్న విద్యార్థులను దారిలో పెట్టగలిగితే..మిగతా విద్యార్థులంతా బుదిగా చదువుకునే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా ఈ రెండు సంఘటనలే కాదు, గత నెల అద్దంకిలోని జాతీయ రహదారి పై విద్యార్థులు బైక్ రేసింగ్ కు దిగారు. రోడ్లకు అడ్డంగా బైక్ లను వేగంగా నడుపుతూ..తీవ్ర భయాందోళనలు కలిగించారు. ఈ బైక్ రేసింగ్ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విచ్చల విడిగా నడి రోడ్లపై బైక్ రేసింగ్ కు దిగడటం గమనార్హం. ఇంత జరుగుతున్న పోలీసులు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. .
ఇదిలా ఉండగా విద్యారులకు జీవితం అంటే ఏమిటో చెప్పడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తుండగా... భవిష్యత్ అనేది ఒకటి ఉంటుందని అవగాహన కల్పించడంలో కళాశాలల యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. రేసింగు.. ఫైటింగు జరుగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa