హడావుడిగా తింటున్న క్రమంలో గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కోవడంతో ఓ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడున్నరేళ్ల కుమారుడు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న ఆ బాలుడు కొబ్బరి ముక్కలను గబగబా తిన్నాడు. అయితే అవి గొంతులో ఇరుక్కుపోయాయి. వెంటనే బాలుడు స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు ఆ బాలుడిని హుటాహుటిన వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa