ఓ ఇద్దరు కామాంధులు వావీవరసలు మరిచిపోయారు. కన్న బిడ్డ అని చూడకుండా బాలికపై ఏడాదిగా తండ్రి, బాబాయి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆ చిన్నారి కుమిలిపోయింది. తల్లికి ఫోన్‌లో చెప్పినా పట్టించుకోకపోవడంతో మరింద వేదనకు గురైంది. చివరకు పోలీసుల చొరవతో ఆమెకు విముక్తి లభించింది. ఈ పాశవిక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని ఓ గ్రామంలో బాధిత బాలిక ఉంటోంది. భర్తతో గొడవ కావడంతో ఆమె తల్లి చిన్న కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తమ్ముడికి తండ్రికి వండుతూ ఆ బాలిక అక్కడే ఉండిపోయింది. కొంత కాలానికి ఆమె బాబాయికి పిన్నికి కూడా గొడవ జరగింది. ఈ క్రమంలో బాలిక పిన్ని కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. బాబాయికి, వారి పిల్లలకు కూడా ఈ బాలికే వండిపెట్టేది. ఇక భార్యలు లేకపోవడంతో అన్నదమ్ములిద్దరూ బాలికపై కన్నేశారు. సంవత్సరం నుంచి బాధితురాలిపై అత్యాచారం చేస్తూ వచ్చారు. చివరకు గ్రామ మహిళా పోలీసుకు గురువారం బాధితురాలు తన గోడు చెప్పుకుంది. ఆమె ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. బాలిక ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa