విశాఖపట్నం: విద్యార్థుల హెల్త్‌కార్డులను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. భీమిలి నియోజకవర్గంలోని 20 వేల మంది విద్యార్థులకు పైలట్ ప్రాజెక్ట్ కింద హెల్త్‌కార్డులు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 5 వేల కోట్లతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుమని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ త్వరలో జీవో విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa