శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ ట్రాన్సిట్ క్యాంప్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు కాల్చి చంపారు.తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించడంతో క్యాంపస్‌లోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రదాడి కారణంగా ఎయిర్‌పోర్టు వైపు వాహనాలను, వ్యక్తులను అనుమతించడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa