నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సమాచారాన్ని మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణా ఓ అజ్ఞాత యోగితో పంచుకున్నారనే వార్తలు మార్కెట్ వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తించాయి. విలువైన సమాచారాన్ని ఈ-మెయిళ్ల ద్వారా బయటకి వ్యక్తులకు చేరవేయడం ద్వారా కొందరికి భారీ లబ్ధి చేకూరిందని సెబీ గుర్తించింది. అయితే చిత్ర ఎవరికి సమాచారం ఇచ్చిందో విచారణలో స్పష్టంగా చెప్పలేదు. హిమాలయాలకు చెందిన ఓ అజ్ఞాత యోగి తనకు సలహాలిచ్చే వారని పేర్కొంది. ఆయనకు శరీరం లేదని, నిరాకారి అని వివరించింది. ఈ విషయాలను నమ్మని సెబీ, సీబీఐ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తితో సీ షెల్స్‌కు వారు విహార యాత్రకు వెళ్లేవారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో సంచలన విషయం వెల్లడైంది. చిత్ర హయాంలో అమాంతం ఎదిగిన ఆనంద్ సుబ్రమణియనే అజ్ఞాత యోగి అని తెలిసింది. ఎన్‌ఎస్‌ఈలో విధులు నిర్వర్తించిన ఆనంద్ సుబ్రమణియనే ఆ యోగి అని, అతడే చిత్ర రామకృష్ణతో ఈ-మెయిల్స్ ద్వారా సంభాషణలు జరిపినట్లు సీబీఐ గుర్తించింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినప్పటికీ అజ్ఞాత యోగి ఆనందేనన్న విషయం దాదాపుగా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa