రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆ దేశ వార్షిక వ్యవసాయ సదస్సులో పాల్గొన్న మాక్రన్ మాట్లాడుతూ ఈ యుద్ధం ఇప్పట్లో ముగియదని అన్నారు. ఈ యుద్ధం చాన్నాళ్లు కొనసాగుతుందని, దానితో వచ్చే సంక్షోభ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని మాక్రన్ హెచ్చరించారు. నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్ శనివారం ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. యూరోప్‌లో మళ్లీ యుద్ధం మొదలైందని, పుతిన్ ఆ యుద్ధాన్ని కాంక్షించారని, ఉక్రెయిన్ ప్రజల పక్షాన యూరోప్ దేశాలు అండగా ఉన్నట్లు మాక్రన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa