కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారాన్ని పెంచింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబానికి పరిహారాన్ని రూ.25వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.12,500 నుంచి రూ.50వేలకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న సొలేషియమ్ పథకం-1989 స్థానంలో ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఇందుకు అవసరమైన నిధి నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa