ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభను నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 09:45 AM

చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతులు కోటయ్యస్వామికి మొక్కు చెల్లించేందుకు ప్రభను నిర్మించారు. స్వయంగా ప్రభను కొండకు తరలించి బుధవారం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి కోటప్పకొండకు ప్రభను నిర్మించారు. నిర్వహణ భారంతో ఆ తర్వాత నుంచి ప్రభను నిర్మించడంలేదు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ యువతులు రూ. 3 లక్షలతో  ప్రభను నిర్మించారు.   ఈ సందర్భంగా యువతులను గ్రామస్థులు ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa