టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. రేపు మొహాలీలో జరగబోయే ఇండియా-శ్రీలంక టెస్టు మ్యాచ్ తో 100 టెస్టుమ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలోకి చేరతాడు కోహ్లి.ఈ ఘనత సాధించిన 71వ ఆటగాడిగా,12వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు కోహ్లి. 100 టెస్టులు ఆడటమంటే చాలా గొప్ప విషయం. ఆటగాడి జీవితంలో ఒక మైలురాయనే చెప్పాలి. ఈ సందర్భంగా సీనియర్ క్రికెటర్లు, తోటి క్రికెటర్లు, అభిమానుల నుండి శుభాకాంక్షలను అందుకుంటున్నాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఒక వీడియో ద్వారా శుభాకాంక్షలను తెలిపాడు. తను 2007లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మొదటిసారిగా విరాట్ పేరు విన్నానని,అప్పుడు విరాట్ అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నాడని,విరాట్ గురించి టీంలో మాట్లాడుకోవటం విన్నానని, విరాట్ చాలా బాగా ఆడతాడని పేర్కొన్నాడు. టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ "ఇది విరాట్ గర్వించదగిన ఘనత అని, ఈ సందర్భాన్ని ఆస్వాదించమని, ఆల్ ది బెస్ట్" అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మ్యాచులో శతకం సాధించి చిరస్మరణీయం చేసుకోవాలని భారత సీనియర్ క్రికెటర్ సునిల్ గవాస్కర్ విరాట్ కు సూచనలిచ్చారు. విరాట్ మాట్లాడుతూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 టెస్టుల వరకు రావడం గొప్పగా అనిపిస్తుందని చెప్పాడు. తన కుటుంబం,కోచ్ అభిమానులు గర్వపడే సమయం అని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa