రష్యా విషయంలో తటస్థవైఖరిని అనుసరిస్తున్న భారత్ ను యుద్దం అడ్డుకోవాలని ఉక్రెయిన్ విన్నవించుకొంది. తమ దేశంపై రష్యా దండయాత్రను అడ్డుకోవాలంటూ ఉక్రెయిన్ మరోసారి ప్రపంచ దేశాలను కోరింది. ముఖ్యంగా భారత్ తన ప్రయోజనాల కోసమైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని యుద్ధాన్ని అడ్డుకోవాలని అభ్యర్థించింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ మేరకు టెలివిజన్ చానల్ లో మాట్లాడారు. ముఖ్యంగా భారత్ ను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే నూతన పంటల సాగు సాధ్యపడదు. కనుక అంతర్జాతీయ, భారత ఆహార భద్రత కోసం అయినా యుద్ధాన్ని ఆపాలి. రష్యాతో ప్రత్యేక సంబంధాలు కలిగిన దేశాలు ‘ అందరి ప్రయోజనాలకు ఈ యుద్ధం వ్యతిరేకం’అని పుతిన్ కు నచ్చజెప్పాలి’’అని కులేబా కోరారు. యుద్ధాన్ని ఆపే దిశగా భారత పౌరులు కూడా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ లోని విదేశీ విద్యార్థుల విషయంలో రష్యా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్టు కులేబా ఆరోపించారు. రష్యా ఈ అంశాన్ని తారుమారు చేయకపోతే.. విదేశీ విద్యార్థులు క్షేమంగా తరలిపోవడానికి వీలుంటుందన్నారు. ‘‘భారత్, చైనా, నైజీరియా దేశాలకు నా వినతి ఏమిటంటే కాల్పులు ఆపి తమ పౌరులు వెళ్లేందుకు సహకరించాలంటూ రష్యాని కోరాలి’’అని కులేబా పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa