చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగడం లేదు. మహిళలు,చిన్నారులపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్లుగా నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో 10వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై స్కూల్ యజమాని అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. నిందితుడు పురుషోత్తమ్ శర్మపై మంగళవారం ముహానా పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.