ఏపీలో మహిళల భద్రతపై సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నేరాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచనున్నట్లు వెల్లడించారు. అందుకోసం 163 ప్రత్యేక వాహనాలు సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా 18 దిశ మొబైల్ రెస్ట్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక దిశయాప్ పనితీరును మరింత మెరుగుపరచాలని, యాప్‌లో బటన్ నొక్కగానే బాధితుల వద్దకు క్షణాల్లో చేరుకోవాలని సూచించారు. ఆధారాలు కూడా సేకరించి, నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలన్నారు. గ్రామాల్లో వలంటీర్, మహిళా పోలీస్‌ల భాగస్వామ్యంలో దిశను పటిష్టంగా అమలు చేయాలన్నారు. దిశ యాప్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఇప్పటి వరకూ 1.16 కోట్ల మంది దిశ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa