మనవడికి అన్ని బుద్ధులు నేర్పించాల్సిన తాత.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనవడిపై అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసులో తాతను కేరళ హై కోర్టు దోషిగా తెల్చింది. అంతే కాకుండా ఆ కిరాతకుడు అయిన తాతకు 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగ 2019 లో కేరళ రాష్ట్రంలో ఒక తాత తన సొంత ఏడేళ్ల మనవడిపై అత్యాచారం చేశాడు. అప్పుడు నమోదు అయిన కేసును కేరళలోని ఓ సెషన్స్ కోర్టు ఇప్పటి వరకు విచారించింది. తాజా గా సోమవారం ఈ కేసులో తాతను దోషిగా తెల్చుతూ తీర్పును వెళ్లడించింది. అంతే కాకుండా అతనికి పలు సెక్షన్ల కింద 73 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ శిక్ష అతనికి ఏక కాలంలోనే అమలు చేయాలని తీర్పును ఇచ్చింది. పిల్లలపై లైంగిక వేధింపులు చేయడం, 12 ఏళ్లలోపు మైనర్ పై లైంగిక వేధింపులు, మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడం, వంటి కేసుల్లో ఒక్కో దానికి 20 ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్లు శిక్ష వేసింది. అలాగే అసహజ అత్యాచారం నేరానికి 10 ఏళ్లు, జువైనల్ జస్టిస్ కింద చిన్న పిల్లలపై క్రూరంగా వ్యవహరించడంపై మూడు సంవత్సరాలు అధనంగా శిక్ష వేసింది. దీంతో మొత్తం 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa