రష్యాకు చెందిన క్రిస్టినా అనే మహిళ 24 ఏళ్లకే 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. తనకు 100 మంది పిల్లలు కావాలని అని ఆమె చెబుతోంది. ఈ 22 మందిని ఆమె దత్తత తీసుకోలేదు. ఆ పిల్లలందరికీ రెండేండ్ల కన్నా తక్కువ వయసే ఉంది. అయితే ఇదెలా సాధ్యపడిందా? అని మీరు ఆశ్చర్యపోతున్నారా? సరోగసీ ప్రక్రియ ద్వారా ఆమె ఈ పిల్లలకు జన్మనిచ్చింది. వీరందరినీ తానే స్వయంగా చూసుకుంటానని, అందరు తల్లుల్లాగనే తానూ వారికి అన్ని పనులు చేస్తానని క్రిస్టినా చెబుతోంది. తనకు ఈ పిల్లలు సరిపోరని, 100 మంది దాకా పిల్లలు కావాలనే కోరిక ఉందని నవ్వుతూ చెబుతోంది.
జార్జియా టూర్ వెళ్లినప్పుడు క్రిస్టినా గాలిప్ ను కలిసింది. అలా వారిద్దరు ఒకటయ్యారు. ఇప్పుడు జార్జియాలోని బటుమీలో నివసిస్తున్నారు. తన పిల్లలతో గడపటానికి రోజుకు 24 గంటలు సరిపోవటంలేదని ఆమె తెలిపింది. సరోగేట్‌ల ద్వారా పిల్లలను కనడం ద్వారా తాను ఏదీ కోల్పోయినట్లు అనిపించడం లేదని, కేవలం శారీరకంగా కలిసి పిల్లల్ని కంటేనే పిల్లలుకాదని ఆమె తెలిపింది. ప్రపంచంలోనే సంతోషకరమైన కుటుంబంగా ఉండాలనుకుంటున్నానని క్రిస్టినా తెలిపింది. క్రిస్టినా తన 17 ఏళ్ల వయస్సులో మొదటిబిడ్డకు సహజంగానే జన్మనిచ్చింది. కానీ తరువాత వారి దాంపత్య బంధంలో వచ్చిన మార్పులతో సరోగసి ద్వారా 22 మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa