ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. తండ్రిది సోడాల వ్యాపారం అని కూతురు బలవన్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 07:50 PM

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో మంగళవారం దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పలమనేరులోని బ్రహ్మర్షి అనే ప్రయివేటు పాఠశాలల మిస్బా(15) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అమ్మాయి తండ్రిది సోడాల వ్యాపారం కావడంతో తోటి విద్యార్థులు హేళన చేశారు. సోడాల వ్యాపారం చేసే వారికి ఇలాంటి స్కూళ్లు అవసరమా అంటూ ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి పిల్లలు ఎగతాళి చేస్తుండడంతో తమ అమ్మాయిని పాఠశాల నుంచి పంపేశారని బాలిక తండ్రి పేర్కొన్నాడు. విద్యార్థిని మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa