సికింద్రాబాద్-డోన్ సెక్షన్ లో నా న్ ఇంటర్ లాకింగ్ పనుల నిమిత్తం రెండు రైళ్లని పాక్షికంగా రద్దు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజనల్ అధికారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబర్. 07269 గుంటూరు-కాచిగూడ రైలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు మహబూబ్ నగర్ వరకే నడచి ఆగిపోతుందిన్నారు. అలానే నెంబర్. 07270 కాచిగూడ- గుంటూరు రైలు కూడా ఆయా తేదీల్లో కాచీగూడ నుండి కాకుండా మహబూబ్ నగర్ నుంచి గుంటూరు వరకు బయలు దేరుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa