ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మపై బెంగతో కుమారుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:49 AM

తల్లి మృతిని జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన సత్తెనపల్లి మండలం లో మంగళవారం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం నడికుడికి చెందిన బాలుడు (17)తల్లి ఏడాది క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. సత్తెనపల్లిలో మేనమామ వద్ద ఆశ్రయం పొందాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తరచూ అమ్మ ను తలచుకొని కుమిలిపోయేవాడు. సహచర కార్మికులు ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించేవారు. సత్తెనపల్లి-గుడిపూడి రైలుమార్గంలో మంగళవారం పట్టాలపై బాలుడు మృతి దేహం రెండు బాగాలై లభ్యమైంది. ఘటనా స్థలాన్ని నడికుడి రైల్వే పోలీసులు పరిశీలించారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa