ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి పుట్టిందని దూరం పెట్టాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:56 AM

ఆడపిల్ల పుట్టిందని తనను కాపురానికి తీసుకెళ్లడo లేదని భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన సాయి నాగ అంజలితో వివాహమైంది. అనుకున్న విధంగా ఎకరంన్నర పొలం, బంగారం, నగదు కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.


ఏడాదిన్నర పాటు వీరి దాంపత్యం సజావుగా సాగింది. ఈ క్రమంలో వీరికి ఆడ పిల్ల జన్మించింది. వేరే కాపురం పెట్టాలంటూ సాయి నాగ అంజలి, వెంకటేశ్వర రావుల మధ్య పలుమార్లు వివాదం జరిగింది. వారసుడు కావాలంటే ఆడబిడ్డకు జన్మనిచ్చావoటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భర్త వెంకటేశ్వరరావు రెండేళ్ళుగా భార్యను కాపురానికి తీసుకు వెళ్ళకుండా ముఖం చాటేశాడు.


కుటుంబ సభ్యుల సూచనలతో అంజలి తన రెండేళ్ల కుమార్తెను తీసుకొని సోమవారం రాత్రి భర్త స్వగ్రామం కాశిపాడు చేరుకుంది. లోపలికి రానిచ్చేందుకు భర్త వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో చంటి బిడ్డతో ఇంటి బయటే బైఠాయించిoది. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరు విడిచి వెళ్ళిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa