కొలను భారతి అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ5, 42, 241 ఆదాయం లభించింది. మంగళవారం క్షేత్ర ప్రాంగణంలో ఆలయ ఈవో మోహన, కోడూరు ఈవో వేణునాథరెడ్డి పర్యవేక్షణలో గత ఏడాది 16-3-2021 నుంచి 22-3-22 వరకు అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించగా రూ5. 42 లక్షల ఆదాయం లభించింది. ఇంత పెద్ద మొత్తం 2016 క్రిష్ణా పుష్కరాలకు మినహాయిస్తే ఆలయం దేవదాయ శాఖలో విలీనం తర్వాత ఇదే ప్రథమమని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ హుండీ లెక్కింపులో సర్పంచ చంద్రశేఖర యాదవ్, ఉపసర్పంచ గోవిందు, వీఆర్‌వో బాబు మియా, ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, సిబ్బంది గంగాధర్, కొత్తపల్లి రాజరాజేశ్వరి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa