ఆదోని పట్టణంలోని మండగిరి పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో గణిత టీచర్‌గా పనిచేస్తున్న ఇందుమతి అనారోగ్య కారణాల వల్ల గత నాలుగు రోజుల క్రితం చికిత్స కోసం సెలవుపై వెళ్లారు. కర్నూలులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సెయింట్ జోసెఫ్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఇందుమతి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa