సమాజంలో కొందరు మహిళలు క్షణిక సుఖం కోసం నిండు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. కామ కోరికలతో రగిలిపోతున్న కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుని.వీరి కామక్రీడలకు అడ్డువస్తే జీవితాంతం తోడు ఉండే భర్తలను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కొందరు మహిళలు తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఈ తరహా ఘటనలు మరి ఎక్కువైపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి.. పిలిబిత్‌కు చెందిన ఓ యువతితో 20రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది.
కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చాలా గ్రాండ్‌గా జరిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న.. అత్తగారింటికి వచ్చిన కొత్తకోడలు తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. పెళ్లి జరిగి సరిగ్గా 20రోజుల గడవక ముందే.. అత్తగారి కుటుంబానికి చెందిన వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను మోసం చేస్తూ.. అతనితో రాసలీలలు సాగించింది. ఇదే ఇంట్లో ఉంటే వీరికి కామక్రీడలు సాగవని ఏకంగా అతనితో కలిసి ఇంట్లో నుండి జంప్ అయింది. విషయం తెలసుకున్న భర్త కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa