ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బత్తలపల్లిలో స్టోర్ బియ్యం పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:37 AM

పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన చౌక బియ్యాన్ని లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసి అధిక ధరకు అమ్మేందుకు హోటళ్లుకు తరలిస్తున్న 18 ప్యాకెట్లు స్టోర్ బియ్యంను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు బత్తలపల్లి ఎస్ఐ టీవీ శ్రీహర్ష తెలిపారు.


స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కాటమయ్య మండలంలోని మాల్యవంతం, వెంకటగారిపల్లి గ్రామాల్లో ప్రజల నుంచి స్టోర్ బియ్యంను కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు ముదిగుబ్బలోని హోటళ్లల్లో అమ్మేందుకు ఆటోలో తరలిస్తున్నట్లు తెలిపారు.


నారసింహపల్లికి వెళ్లే దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీటిని పట్టుకున్నట్లు తెలిపారు. కాటమయ్యను. అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ప్రభుత్వం పేద ప్రజలకు అందించే బియ్యంను ఆక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడం నేరమన్నారు. అనంతరం వాటిని సీఎస్డిటీ శారదకు అప్పగించారు. విఆర్ఒ కుళ్లాయప్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa