ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:38 AM

గుత్తి మండల పరిధిలోని ఇసురాలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి వివాహిత సుచరిత (35) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మురహరి బాబు తెలిపారు.


వివరాలు ఇలాఉన్నాయి. ఇసురాలపల్లి లో భర్త బాబయ్య తో కలసి కాపురం చేస్తున్న సూచరిత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం కోసం ఎంతో ఖర్చు చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో జీవితం పై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంటి లో ఎవ్వరూ లేనిసమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


సమాచారం మేరకు అక్కడకు చేరుకుని ఘటనా స్థలానికి పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa