ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనర్హుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:41 AM

ప్రధానమంత్రి కిసాన్  సమ్మాన్  నిధుల్లో 4,350 కోట్లు అనర్హుల ఖాతాల్లో జమ అయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్  తోమర్  తెలిపారు. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019 నుంచి అమలు చేస్తున్న ఈ పథకంలోని మొత్తం నిధుల్లో 2 శాతం ఇతరుల ఖాతాల్లో పడినట్లు వెల్లడించారు. అనర్హుల ఖాతాలో జమ అయిన నిధులు వెనక్కి తీసుకొచ్చేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు స్వతహాగా డబ్బులు వెనక్కి అందించాలని కేంద్రమంత్రి సూచించారు. ఇప్పటివరకు అనర్హులు నుంచి సుమారు 296 కోట్లు వసూలు చేసిననట్లు మంత్రి వెల్లడించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa