స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని డీఎంహెఓ డాక్టర్ ఎస్. వి. రమణకుమారి హెచ్చరించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆడపిల్లల పుట్టుక తక్కువగా ఉన్న మండలాల్లో స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్. రామ్మోహన్, జిల్లా క్షయ నివారణ అధికారి రాణిసంయుక్త, నేచర్ సంస్థ ప్రతినిధులు మీనాకుమరి, జీకే దుర్గ, డెమో ప్రతినిధి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa