ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ తీర ప్రాంత రక్షణకు అదనపు నిధులు ఏమైనా ఇచ్చారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:50 PM

ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత రక్షణకు అదనపు నిధులు ఏమైనా ఇచ్చారా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో అడిగారు. ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతానికి కేవలం 21 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, 18 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ బోట్లు పనికి రాకుండా పోయాయని, పోలీస్ స్టేషన్ల సమీపంలో ఎటువంటి జెట్టీలు నిర్మించలేదని, ఇందుకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు. జెట్టి లను నిర్మించేందుకు మూడున్నర కోట్ల రూపాయలు కాకుండా అదనంగా నిధులు కేటాయించారా అని కూడా అడిగారు.


కేంద్ర హోం శాఖ డిప్యూటీ మంత్రి నిశిత ప్రామాణిక్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ పోస్టల్ సెక్యూరిటీ స్కీం ఫేస్1, 2 ల కింద ఆంధ్రప్రదేశ్ కు 21 కోస్టల్ పోలీస్ స్టేషన్లు, 7 జెట్టీలు మంజూరయ్యాయి. 27 నాలుగు చక్రాల వాహనాలు, 48 ద్విచక్ర వాహనాలు, 18 బోట్లు కేటాయించి, 2017 జూలై 19 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహణను చేపట్టింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కోస్టల్ పోలీస్ సిబ్బంది శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మచిలీపట్నంలో భూమిని కేటాయించింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం గుజరాత్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa